: మాటలొద్దు...చేతలు కావాలి...ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, చాలు: కేంద్రాన్ని నిలదీసిన గల్లా

లోక్ సభ సాక్షిగా గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. విభజన సందర్భంగా, ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో హామీలు ఇచ్చారని ఆయన అన్నారు. పార్లమెంటు లోపలా, వెలుపలా ఇదే తంతు కొనసాగిందని ఆయన గుర్తు చేశారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదని ఆయన స్పష్టం చేశారు. అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిందని ఆయన గుర్తు చేశారు. ఈ రెండేళ్లలో విభజన చట్టంలో ఇచ్చిన ఏ హామీని కేంద్రం పూర్తి చేసిందో చెప్పాలని నిలదీశారు. లోటు బడ్జెట్ తో అతలాకుతలమవుతున్న ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అరాకొరగా నిధులు విదుల్చుతోందని అన్నారు. మాటలు చెప్పే సమయం ముగిసిపోయిందని ఆయన స్పష్టం చేశారు. ఇంకా మాటలు చెబితే ప్రజలు ఊరుకోరని ఆయన తెలిపారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, తక్షణం ఏపీకి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. ఇక మాటలు వినే ఓపిక ప్రజలకు లేదు, చేతలు కావాలని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు ఎలా కేటాయిస్తారు? ఎంత కేటాయిస్తారు? ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారు? ఎంత సమయం లోపు నెరవేరుస్తారని పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News