: 'ఐఐటీ బొంబాయి' కొత్త బ్యాచ్ పై సర్వే... వెల్లడైన ఆసక్తికర విషయాలు!

హార్వార్డ్ క్రిమ్ సన్ సర్వే స్పూర్తితో ఐఐటీ-బొంబాయ్స్ న్యూస్ పేపర్ 'ఐఐటీ బాంబే'లో కొత్తగా జాయినైన విద్యార్థులపై ఓ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో అభిరుచులు, లక్ష్యాలతో పాటు, గతంలో సెక్స్ అనుభవం ఉందా? లేదా?, క్యాంపస్ లోకి రాకముందు రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి?, మత విశ్వాసాలపై నమ్మకం ఉందా?, భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? వంటి అన్ని ప్రశ్నలు వున్నాయి. విద్యాధికులైన యువకులైనందున సర్వేకు వారంతా సహకరించారని సర్వే నిర్వాహకులు తెలిపారు. అత్యున్నత విద్యాసంస్థలు సమాజానికి ఎలాంటి గ్రాడ్యుయేట్లను అందిస్తున్నాయన్నది తెలుసుకోవడమే ఈ సర్వే ఉద్దేశ్యమని నిర్వహకులు తెలిపారు. 60 శాతం మంది విద్యార్థులు అసలు మతాలను నమ్మడం లేదని తేలింది. 30 శాతం మంది మాత్రమే మతాలను విశ్వసిస్తున్నారు. ఫస్ట్ సెమిస్టర్ వరకు జాగ్రత్తగా ఉన్న విద్యార్థులు ఫస్ట్ సెమ్ ముగిశాక ఫేస్ బుక్ లో రోజుకు 1.6 గంటలు గడుపుతున్నట్టు తెలిపారు. రోజుకు 1.4 గంటలు చదువుకు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. అలాగే హోమో సెక్సువాలిటీ పట్ల 75 శాతం మంది ఆసక్తిగా ఉన్నారు. అదే సమయంలో 95 శాతం మంది క్యాంపస్ కు రాకముందు ఎలాంటి సెక్స్ అనుభవం లేదని, తాము వర్జిన్స్ అని తెలిపారు. కేవలం ఐదు శాతం మంది మాత్రమే సంబంధాలు కలిగి ఉండడం విశేషం. పాశ్చాత్య దేశాల్లో స్కూలింగ్ సమయంలోనే గర్భవతులవుతుండగా, భారత్ లో గ్రాడ్యుయేషన్ వరకు ఆగడం శుభసంకేతమేనని సంప్రదాయ వాదులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News