ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమ్మాయిల అభినందనలే ఎక్కువగా వస్తున్నాయి: హీరో సుధీర్ బాబు

Wed, May 04, 2016, 10:36 AM
Related Image అమ్మాయిల అభినందనలే తనకు ఎక్కువగా వస్తున్నాయని ఇటీవల విడుదలైన హిందీ చిత్రం ‘బాఘీ’లో విలన్ పాత్ర పోషించిన తెలుగు హీరో సుధీర్ బాబు అన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘బాఘీ’ చూసిన తర్వాత ఎక్కువ మంది అమ్మాయిలే తనను అభినందిస్తూ మెసేజ్ లు చేస్తున్నారన్నాడు. ఈ చిత్రంలో తన పాత్ర బాగుందంటూ ప్రముఖ నటుడు శక్తికపూర్ తనకు ఫోన్ చేసి చెప్పారన్నారు. బాలీవుడ్ లో తనకు మంచి అవకాశాలొస్తున్నాయన్నారు. ఏ చిత్రం పడితే అది ఒప్పుకోకుండా, సెలెక్టెడ్ చిత్రాలను ఎంచుకుంటానని, హిందీ చిత్రాల్లో హీరోగానే నటించాలనే నిబంధనలేవీ తనకు లేవని, ప్రాధాన్యం ఉన్న ఏ పాత్రలో నైనా నటిస్తానని సుధీర్ బాబు చెప్పాడు.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Articles (Latest)
Articles (Education)