: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జోసెఫ్ నియామకం

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కేఎం జోసెఫ్ నియమితులు కానున్నారు. ఇప్పటిదాకా హైకోర్టు తాత్కాలిక సీజేగా కొనసాగుతున్న జస్టిస్ దిలీప్ బీ భోసాలేకు పదోన్నతి లభించింది. హైకోర్టు న్యాయమూర్తి హోదా నుంచి ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఈ క్రమంలో ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ కానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కోలీజియం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫారసు చేసింది. ఈ సిఫారసులకు ఆమోదం లభించిన వెంటనే జస్టిస్ జోసెఫ్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఆయన ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేస్తున్నారు. జస్టిస్ జోసెఫ్ హైదరాబాదు రాగానే, జస్టిస్ భోసాలే మధ్యప్రదేశ్ వెళ్లనున్నారు.

More Telugu News