ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మాల్యాకు షాకిచ్చిన అన్సారీ!... సంతకం లేని రాజీనామా లేఖను తిరస్కరించిన వైనం

Wed, May 04, 2016, 06:37 AM
Related Image బ్యాంకులకు కోట్లాది రూపాయల రుణాలను ఎగవేసి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు రాజ్యసభ చైర్మన్ హోదాలోని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ షాకిచ్చారు. రాజ్యసభ నుంచి తనను బహిష్కరించకముందే గౌరవప్రదంగా రాజీనామా చేద్దామని తలచిన మాల్యా యత్నం ఫలించలేదు. తన పదవికి రాజీనామా చేస్తూ మాల్యా పంపిన లేఖను సాంకేతిక కారణాలు చూపి అన్సారీ తిరస్కరించారు. ఈ మేరకు మాల్యా రాజీనామా లేఖను తిరస్కరించినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ షంషేర్ షరీఫ్ నిన్న ప్రకటించారు. నిర్దేశిత ఫార్మాట్ లో లేని సదరు లేఖను చైర్మన్ తిరస్కరించారని ఆయన పేర్కొన్నారు. కనీసం రాజీనామా లేఖపై మాల్యా సంతకం కూడా చేయకుండానే పంపారని కూడా ఆయన చెప్పారు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Articles (Latest)
Articles (Education)