: రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ సినీ అవార్డుల ప్రదానం!

ఈ ఏడాది జాతీయ సినీ అవార్డుల ఉత్సవంలో తెలుగు సినిమాలు 'బాహుబలి', 'కంచె' సినిమాలు సత్తా చాతిని సంగతి విదితమే. 2015వ సంవత్సరానికి గాను జాతీయ సినిమా పురస్కారాలను ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, సంజయ్ లీలా భన్సాలీ తదితరులు హాజరయ్యారు. * ఉత్తమ జాతీయ సినిమాగా 'బాహుబలి'. * ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా 'భజరంగీ భాయ్ జాన్'. * ఉత్తమ తెలుగు సినిమాగా 'కంచె'. * ఉత్తమ తమిళ చిత్రంగా 'విషారనై'. * ఉత్తమ కన్నడ సినిమాగా 'తిథి'. * ఉత్తమ హిందీ సినిమాగా 'దమ్ లగాకే హైసా'. * ఉత్తమ మలయాళ సినిమాగా 'పతేమరి'. * ఉత్తమ్ నటుడిగా 'పీకూ' సినిమాలో తనదైన శైలిలో నటనను పండించిన దిగ్గజం అమితాబ్ బచ్చన్. * ఉత్తమ నటిగా కంగనా రనౌత్ (తను వెడ్స్ మను). * ఉత్తమ దర్శకుడిగా సంజయ్ లీలా భన్సాలీ (బాజీరావ్ మస్తానీ). * స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో 'బాహుబలి'. * ఉత్తమ సహాయ నటుడిగా 'విరసనై' సినిమాలో నటించిన సముద్ర ఖని. * ఉత్తమ సహాయనటిగా 'బాజీరావ్ మస్తానీ'లో నటించిన తన్వి అజ్మీ. * ఉత్తమ బాల నటుడిగా మలయాళ సినిమా 'బెన్'లో నటించిన గౌరవ్ మీనన్. * ఉత్తమ కొరియోగ్రాఫర్ గా 'బాజీరావ్ మస్తానీ'లో దివానీ మస్తానీ పాటకు డాన్స్ సమకూర్చిన రెమో డిసౌజా. * ఉత్తమ కెమెరా మెన్ గా 'బాజీరావ్ మస్తానీ' సినిమాకి పని చేసిన సుదీప్ ఛటర్జీ. * ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలో తమిళ సినిమాకు 'థారై థపతై' ఇళయరాజా. * మలయాళ సినిమా 'ఎన్ను నింటే మోయిదీన్' సినిమాకు సంగీతం (పాటలకు) అందించిన ఎం.జయచంద్రన్ ఉత్తమ సంగీతం పురస్కారం... రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు.

More Telugu News