: ధోనీకి ఖాళీ దొరికితే ఏం చేస్తాడో తెలుసా?

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తీరిక లేని షెడ్యూళ్లతో బిజీబిజీగా గడుపుతుంటాడు. టోర్నీ లేదంటే ఎండార్స్ మెంట్లు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉంటాడు. ఇంకా తీరిక దొరికితే ఆర్మీలో విధులు నిర్వర్తించేందుకు వెళ్తుంటాడు. ఇన్ని పనుల మధ్య ఖాళీ దొరకడమే కష్టం... అలాంటిది ధోనీకి తీరిక చిక్కితే ఏం చేస్తాడు? ఇంట్లో కుటుంబంతో సేదదీరుతాడు. ఇంట్లో కుమార్తె జివాతో గడపడం ధోనీకి అత్యంత ప్రధానమైన వ్యాపకం. కుమార్తెతో గడిపిన క్షణాలను గుండెల్లో భద్రపరచుకుంటాడు. తీరిక వేళలో ధోనీ కుమార్తెతో ఆడుకుంటాడని చెబుతూ, అతని భార్య సాక్షి ఇన్ స్టా గ్రాంలో కొన్ని ఫోటోలను పోస్టు చేసింది. ఈ ఫోటోల్లో కుమార్తెను తన్మయత్వంతో చూసుకుంటున్న ధోనీ కనువిందు చేశాడు.

More Telugu News