: లాడెన్ జాడ చెప్పిన డాక్టర్ ను రెండు నిమిషాల్లో విడిపిస్తానన్న ట్రంప్... నువ్వెవరంటూ నిప్పులు చెరిగిన పాక్

అమెరికా ట్విన్ టవర్స్ పై ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ ఖైదా దాడులు చేసిన తరువాత, అతన్ని అంతమొందించేందుకు అమెరికన్ మెరైన్ సిబ్బందికి సహకరించి, లాడెన్ జాడను తెలిపి, ఇప్పుడు పాక్ జైల్లో ఉన్న డాక్టర్ షకీల్ అఫ్రిది మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అమెరికన్ అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున పోటీ పడనున్న డొనాల్డ్ ట్రంప్ ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, "నేను అధ్యక్షుడినైతే, షకీల్ ను రెండు నిమిషాల్లో విడిపిస్తా. మనం పాక్ కు నిధులిస్తున్నాం. మన మాట వాళ్లు వింటారు" అని అనడం పాక్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. పాక్ గురించి ట్రంప్ కు అవగాహన లేదని, అఫ్రిది భవిష్యత్తును నిర్ణయించడానికి ట్రంప్ ఎవరని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి చౌదరీ నిస్సార్ అలీ ఖాన్ నిప్పులు చెరిగారు. చిల్లర విదిల్చుతూ, భయపెడదామని చూడటం ఆయన పొరపాటని, మిగతా దేశాలను గౌరవించడం నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. తమ దేశపు కోర్టులు మాత్రమే అఫ్రీదిపై నిర్ణయం తీసుకుంటాయని, ట్రంప్ ఏమీ చేయలేడని ఆయన విమర్శించారు.

More Telugu News