: తెలంగాణలో ఇక వాహన రిజిస్ట్రేషన్ చార్జీల చెల్లింపు షోరూమ్ లోనే!

ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేస్తే, టెంపరరీ రిజిస్ట్రేషన్ సంఖ్యను తీసుకున్న తరువాత, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం రావాణా శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి రావడం, వ్యయ ప్రయాసలకు గురవాల్సి వుండడం అందరికీ తెలిసిందే. ఇకపై తెలంగాణ రాష్ట్రంలో ఈ కష్టాలు దూరం కానున్నాయి. షోరూములో వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడే రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా చెల్లించే కొత్త విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకూ రవాణా శాఖ కార్యాలయాల్లోనే రుసుము చెల్లించే విధానం అమలవుతుండగా, ఇకపై షోరూముల్లోనే డబ్బు చెల్లించే వెసులుబాటు దగ్గరైంది. ఆర్టీఓ కార్యాలయాల్లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటంతో రిజిస్ట్రేషన్ ఆలస్యం అవుతుందన్న కారణంగా ఈ కొత్త విధానానికి రవాణా శాఖ శ్రీకారం చుట్టింది.

More Telugu News