: అభిమానులను సస్పెన్సులో పెట్టిన ప్రియాంక చోప్రా

హాలీవుడ్ చిత్రం ‘బే వాచ్’లో తాను స్విమ్ సూట్ వేసుకున్నదీ లేనిదీ ఇప్పుడే చెప్పనని, తన అభిమానులు సినిమా చూసే తెలుసుకోవాలని బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా చెప్పింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, బే వాచ్ చిత్రంలో తాను కొత్తగా కనిపిస్తానని చెప్పింది. అలాగే, మరే ఇతర టీవీ సిరీస్ లోను నటించనని అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’లో నటించిన ప్రియాంక పేర్కొంది. ప్రస్తుతం తీరిక లేకుండా పనిచేస్తున్నానని, త్వరలో ఇండియాకు వస్తానని, రెండు నెలల పాటు తన కుటుంబంతో గడుపుతానని ప్రియాంక చోప్రా పేర్కొంది.

More Telugu News