: 2050 నాటికి ముస్లింల సంఖ్య క్రైస్తవులకు సమాన‌మ‌వుతుంది: మ‌త విశ్వాసాలపై జరిపిన ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి

ప్ర‌పంచంలో 2050 నాటికి ముస్లింల సంఖ్య క్రైస్తవులకు సమానమవుతుందని లండ‌న్‌లోని పియూస్ రిసెర్చ్ సెంటర్ ప‌రిశోధకులు చెబుతున్నారు. ప్రపంచంలోని వ్యక్తులు, వారి ఆర్థిక, సామాజిక ప‌రిస్థితులను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని వారిలోని మ‌త విశ్వాసాల‌పై నిర్వ‌హించిన స‌ర్వేలో భాగంగా ఈ విష‌యాన్ని పేర్కొంటున్న‌ట్లు ప‌రిశోధకులు తెలిపారు. ప్ర‌పంచంలోని వెన‌క‌బ‌డిన దేశాల్లోనే మ‌త‌విశ్వాసాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. మ‌తం అన్ని అంశాల‌క‌న్నా ముఖ్యమైంద‌నే అంశాన్ని ఆర్థికంగా అభివృద్ధి సాధించిన దేశాల్లోని ప్ర‌జ‌లు ఒప్పుకోవ‌ట్లేద‌ని తెలిపారు. వెన‌క‌బ‌డిన దేశాల్లో మాత్రం మతవిశ్వాసాన్ని అధికంగా వ్య‌క్తం చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అయితే అభివృద్ధి చెందిన అమెరికాలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా వుంది. అక్కడి ప్రజలు మ‌త విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నార‌ని తెలిపారు. ఆర్థికాభివృద్ధి సాధించిన దేశాల్లో మ‌తానికి ప్రాధాన్య‌త ఇచ్చే వారి సంఖ్య 20 శాతం కన్నా తక్కువగా ఉంద‌ని స‌ర్వే తెలిపారు. ఇథియోపియా దేశంలో మ‌త విశ్వాసానికే ప్రాధాన్య‌త ఇస్తున్న వారు 98శాతం మంది ఉన్నార‌ని పేర్కొన్నారు. చైనాలో మ‌తానికి ప్రాధాన్య‌త ఇచ్చేవారు ప్రపంచంలోనే అతి త‌క్కువ‌గా ఉన్నార‌ని తెలిపారు. భార‌త్‌లో 80శాతం మంది ప్ర‌జ‌లు మ‌తానికి ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని పేర్కొన్నారు.

More Telugu News