: నా అసలైన వారసుడు మోహన్ బాబు!: దాసరి

తెలుగు సినీ రంగంలో ఎందరో వారసులను తీసుకుని వచ్చారని, నిజం చెప్పాలంటే, తనకు అసలైన వారసుడు మోహన్ బాబేనని దర్శకుడు దాసరి నారాయణరావు తెలిపారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు మాట్లాడారు. కొందరికి తమ కుటుంబం నుంచి మాత్రమే వారసులు వచ్చారని, తనకు మాత్రం తాను పరిచయం చేసిన వారంతా వారసులేనని అన్నారు. తన వారసుడిని చిత్ర రంగంలో నిలపలేదన్న బాధ తనకు లేదని చెప్పారు. దర్శకుడు పూరీ జగన్నాధ్ పనితీరు తనకు నచ్చుతుందని అన్నారు. డిసిప్లేన్ విషయంలో, ఒక పనిని సాధించడంలో మోహన్ బాబు తన స్టయిల్ ను ఫాలో అవుతారని అన్నారు. ఎన్నో హిట్ చిత్రాలను తీసిన రేలంగి నరసింహారావు, ధవళ సత్యం వంటి వారు తనకు అత్యంత ఆప్తులని చెప్పారు.

More Telugu News