: 'మ్యాజిక్ రెక్స్ సర్వీస్‌'కి గుడ్ బై... ట్విట్టర్ సంచ‌ల‌న నిర్ణయం

సోష‌ల్ మీడియా వెబ్‌సైట్ ట్విట్ట‌ర్ త‌న ఫీచ‌ర్‌లలో నుంచి ‘మ్యాజిక్ రెక్స్’ ను తొల‌గిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. చాటింగ్, ప్రముఖుల అకౌంట్స్ ఫాలోయింగ్ వంటి అంశాలకు ఈ మెసేజ్ బాట్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ‘మ్యాజిక్ రెక్స్’ కు గుడ్ బై చెబుతుండ‌డంతో ఇక‌పై ట్విట్ట‌ర్ యూజ‌ర్లు దీని ద్వారా ఫ్రెండ్స్‌కి, ఫాలోయర్స్‌కి ప‌ర్స‌న‌ల్ మెసేజ్ లు చేసుకునే అవ‌కాశం లేకుండా పోతుంది. వినియోగదారులకు శుభ‌వార్త అందిస్తూ మెసేజ్ పంపించడంలో గరిష్టంగా ఉన్న 140 క్యారెక్టర్ల పరిమితిని ట్విట్టర్ కొద్ది కాలం క్రిత‌మే ఎత్తేసి, ప‌దాల సంఖ్య‌ను పెంచిన‌ విష‌యం తెలిసిందే. మ్యాజిక్ రెక్స్‌ని తొల‌గిస్తున్న‌ప్ప‌టికీ పుష్ నోటిఫికేషన్స్ స‌ర్వీస్ మాత్రం అందుబాటులోనే ఉంటుంద‌ని ట్విట్ట‌ర్ పేర్కొంది. ఇక మీదట పుష్ నోటిఫికేషన్ ద్వారా సందేశాలు పంపుకోవచ్చని ట్విట్టర్ తెలిపింది.

More Telugu News