: పాస్ పోర్టు రద్దు చేస్తే... నన్ను అరెస్ట్ చేస్తే... సింగిల్ పైసా రాదు!: మాల్యా వితండ వాదన

తన నుంచి రుణాన్ని వసూలు చేసేందుకు రంగంలోకి దిగిన భారత ప్రభుత్వ చర్యలను పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా తప్పుబట్టారు . తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందని చెబుతున్న ఆయన... రుణం మొత్తాన్ని చెల్లించడం మాత్రం తనతో అయ్యే పనికాదని తేల్చేశారు. అలాగని రుణాన్ని ఎగ్గొట్టనని, తీసుకున్న రుణంలో తన శక్తి మేర చెల్లిస్తానని కూడా ఆయన బ్యాంకులకు బంపర్ ఆఫరిచ్చారు. ఈ మేరకు బ్రిటన్ ప్రముఖ పత్రిక ‘ఫైనాన్షియల్ టైమ్స్’ ఆయనను ఉటంకిస్తూ పలు ఆసక్తికర అంశాలతో ఓ ప్రత్యేక కథనాన్ని రాసింది. ఈ కథనంలో మాల్యా వితండ వాదన చేశారు. తన పాస్ పోర్టు రద్దు చేయడం ద్వారానే కాక, తనను అరెస్ట్ చేస్తే డబ్బెలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ చర్యల ద్వారా తన నుంచి సింగిల్ పైసా కూడా వసూలు చేయలేరని ఆయన స్పష్టం చేశారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం తీసుకున్న సదరు రుణాన్ని తాను ఏమాత్రం డుర్వినియోగం చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఆ రుణం సొమ్మును విదేశాలకు తరలించలేదని, ఈ డబ్బుతో ఆస్తులు కొనలేదని కూడా మాల్యా నిష్టూరమాడారు.

More Telugu News