: ఈస్ట్ కోస్ట్ లో సత్తా చాటిన ట్రంప్!... దూసుకెళుతున్న హిల్లరీ!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో రియల్ ఎస్టేట్ టైకూన్ డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ ల మధ్యే పోటీ నెలకొనే అవకాశాలున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలోకి దిగేందుకు ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. అదే సమయంలో విదేశాంగ శాఖ మంత్రి హోదాలో సత్తా చాటిన హిల్లరీ క్లింటన్... డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటిదాకా ఆయా పార్టీలు తమ అభ్యర్థులను నిర్ధారించేందుకు నిర్వహిస్తున్న ‘ప్రైమరీ’ ఎన్నికల్లో వీరిద్దరూ తమ ప్రత్యర్థులను కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. తాజాగా ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలోని ఐదు ప్రైమరీలకు జరిగిన ఎన్నికల్లో ట్రంప్ క్లీన్ స్వీప్ చేశారు. మొత్తం ఐదు స్థానాల్లో(మేరీ ల్యాండ్, కనెక్టికట్, పెన్సిల్వేనియా, డెలావర్, రోడ్ ఐల్యాండ్) విజయం సాధించిన ట్రంప్... రిపబ్లికన్ అభ్యర్థిగా అధ్యక్ష బరిలోకి దిగే అవకాశాలను మరింత మెరుగుపరచుకున్నారు. ఇక హిల్లరీ కూడా సత్తా చాటి ఐదింటిలో మూడింటిలో(మేరీ ల్యాండ్, పెన్సిల్వేనియా, డెలావర్) విజయం సాధించారు. అధ్యక్ష రేసులో నిలిచేందుకు డెమోక్రటిక్ పార్టీకి చెందిన నేత బెర్నీ శాండర్స్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న హిల్లరీ మూడు స్థానాలను చేజిక్కించుకుని సత్తా చాటారు.

More Telugu News