: శ్రీసిటీలో క్యాడ్ బరీ ప్లాంట్... ఆసియాలోనే అతిపెద్ద చాక్లెట్ తయారీ యూనిట్!

చాక్లెట్ల తయారీలో క్యాడ్ బరీ పేరెన్నికగన్న కంపెనీగా ఎదిగింది. బహుళ జాతి సంస్థగా పలు దేశాల్లో చాక్లెట్ తయారీ ప్లాంట్లను కలిగిన ఆ సంస్థ... తాజాగా నవ్యాంధ్రలోనూ ఓ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. చిత్తూరు జిల్లా సత్యవేడు సమీపంలోని శ్రీసిటీ సెజ్ లో ఏర్పాటైన ఈ ప్లాంట్ ను ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం లాంఛనంగా ప్రారంభించారు. ఈ యూనిట్... చాక్లెట్ల తయారీ యూనిట్లలో ఆసియాలోనే అతిపెద్దదిగా రికార్డులకెక్కింది. రూ.1,250 కోట్ల వ్యయంతో 130 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ యూనిట్ ద్వారా 1,600 మందికి ఉపాధి లభించనుంది. ఏటా 60 వేల టన్నుల చాక్లెట్లను ఈ యూనిట్ ఉత్పత్తి చేస్తుందట.

More Telugu News