: పిచ్చిపిచ్చి ప్రచారాలు ఆపండి: 'పింక్ మూన్' ప్రచారంపై శాస్త్రవేత్తలు

ఈ రోజు రాత్రి 11 గంటల నుంచి వేకువ జాముణ 3 గంటల వరకు చంద్రుడు గులాబీ రంగులో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. పలువురు జ్యోతిష్యులు గ్రహాలు కదులుతున్నాయని, తద్వారా చర్యల్లో భాగంగా చంద్రుడు గులాబీ రంగులో కనిపిస్తాడని ప్రచారం చేస్తున్నారు. దీనిపై శాస్త్రవేత్తలు, హేతువాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారం పెంచుకునేందుకు, మూఢ విశ్వాసాలు పెంచేందుకు జ్యోతిష్యులు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని వారు స్పష్టం చేశారు. చంద్రుడు సాధారణంగా ఎప్పట్లా ఉంటాడని వారు తెలిపారు. అమెరికాలో ఏప్రిల్ మాసంలో వసంత రుతువు ప్రారంభమవుతుందని, దీని వల్ల అక్కడ చెర్రీస్ వంటి గులాబీ రంగు పుష్పాలు విచ్చుకుంటాయని, అలా వచ్చే తొలి పూర్ణిమ కావడంతో దీనికి పింక్ మూన్ అని పేరు వచ్చిందని వారు వెల్లడించారు. రుతువు మారుతుంది తప్ప చంద్రుడు గులాబీ రంగులో దర్శనమిస్తాడని అర్థం కాదని వారు స్పష్టం చేశారు. పిచ్చిపిచ్చి ప్రచారాలు మానాలని వారు హితవు పలికారు.

More Telugu News