: స్టాక్ మార్కెట్ వరుస లాభాలకు బ్రేక్!

గత కొన్ని సెషన్లుగా లాభాల్లో నిలుస్తూ వచ్చిన భారత స్టాక్ మార్కెట్ పరుగుకు, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో బ్రేక్ పడింది. సెషన్ ఆరంభం నుంచే ఒత్తిడిలో కొనసాగిన సూచికలు, పలుమార్లు లాభాల దిశగా సాగినప్పటికీ, ఒత్తిడిని తట్టుకోలేక చతికిలబడ్డాయి. ఇదే సమయంలో స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీలు మాత్రం నామమాత్రపు లాభాలను నమోదు చేశాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 42.24 పాయింట్లు పడిపోయి 0.16 శాతం నష్టంతో 25,838.14 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 12.75 పాయింట్లు పడిపోయి 0.16 శాతం నష్టంతో 7,899.30 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.08 శాతం, స్మాల్ క్యాప్ 0.02 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 25 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. ఎస్బీఐ, మారుతి సుజుకి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీలు లాభపడగా, హిందుస్థాన్ యునీలివర్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, సన్ ఫార్మా, కోటక్ బ్యాంక్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి.బీఎస్ఈలో మొత్తం 2,725 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,250 కంపెనీలు లాభాల్లోను, 1,312 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. గురువారం నాడు రూ. 97,58,667 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 97,57,048 కోట్లకు తగ్గింది.

More Telugu News