: సబ్బుతో స్నానం చేసినా లావయ్యే ప్రమాదం ఉందట!

సబ్బుతో స్నానం చేసినా ఊబకాయం బారినపడే ప్రమాదం ఉందంటే నమ్మగలరా? ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నమ్మితీరాలి. సబ్బుతో స్నానం చేసినా ఊబకాయం బారినపడే ప్రమాదం ఉందని యూనివర్సిటీ ఆఫ్ జార్జియా చేసిన స్టడీలో తేలింది. సోపులు, గోళ్ల రంగులు, ప్లాస్టిక్ వస్తువుల్లో వాడే థలేట్ అనే రసాయనం శరీరంలోని కొవ్వు శాతంపై ప్రభావం చూపుతుందని వారు కనుగొన్నారు. ఈ థలేట్లు మానవ శరీరానికి హాని కలిగిస్తాయని వారు తెలిపారు. దీని ప్రభావంతో వివిధ రుగ్మతలకు గురయ్యే ప్రమాదం ఉందని ఈ స్టడీకి సారధ్యం వహించిన ప్రొఫెసర్ లీ ఇన్ తెలిపారు. సబ్బుల వినియోగం కారణంగా మానవ శరీరంలో థలేట్లు ఉన్నట్టు ఇదివరకే నిరూపణ అయిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు బెంజైల్ బుటిల్ థలేట్ (బీబీపీ) కారణంగా శరీరంలో కొవ్వులో చోటుచేసుకునే మార్పులపై గతంలో యూనివర్సిటీ ఎలుకలపై చేసిన పరిశోధన నిజమేనని తేలిందని ఆయన పేర్కొన్నారు.

More Telugu News