: ప్రపంచంలో తొలి మలేరియా రహిత ఖండాన్ని ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ

మలేరియా... దోమకాటు కారణంగా వచ్చే ప్రాణాంతక రోగం. ప్రస్తుతం యూరప్ జోన్ లో మలేరియా దోమలు లేవని, మలేరియా యూరప్ నుంచి పూర్తిగా మాయమైందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. యూరప్ మలేరియా రహిత ఖండమని పేర్కొంది. 1995లో 90,712 మలేరియా కేసులు నమోదుకాగా, గత సంవత్సరం ఒక్క కేసు కూడా రాలేదని వెల్లడించింది. యూరోపియన్ రీజియన్ లోని 53 దేశాల్లో 90 కోట్ల మంది ప్రజలున్నారని గుర్తు చేసింది. 2005లో తాష్కెంట్ డిక్లరేషన్ లో భాగంగా యూరప్ నుంచి మలేరియాను పూర్తిగా తరిమికొట్టేందుకు నిర్ణయం తీసుకోగా, అది సాకారమైందని డబ్ల్యూహెచ్ఓ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ జుసుజ్ సన్నా జాకబ్ వెల్లడించారు. యూరప్ ప్రజల ఆరోగ్యంలో ఇదో పెద్ద మైలురాయని ప్రకటించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు చర్యలు తీసుకోవాల్సి వుందని, అందుకు ప్రభుత్వాల సహకారం అవసరమని పేర్కొన్నారు. కాగా, గత సంవత్సరం మొత్తం 214 మలేరియా కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి.

More Telugu News