: ఇక తెలుగులోనే ట్రేడింగ్!... దేశంలోనే తొలి ప్రాంతీయ భాషా ట్రేడింగ్ ఫ్లాట్ ఫాంగా ‘కైట్’ ఆవిర్భావం!

స్టార్ మార్కెట్ ట్రేడింగ్ లో పాలుపంచుకోవాలంటే... ఇప్పటిదాకా ఆంగ్లం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఈ కారణంగానే ప్రాథమిక విద్య మాత్రమే పూర్తి చేసిన భారతీయ గ్రామీణ ప్రజలు ట్రేడింగ్ లో ఇప్పటిదాకా కాలు మోపనే లేదు. అయితే ఇలాంటి వారి కోసం ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ‘జిరోధా’ ఓ కీలక అడుగు వేసింది. వెబ్ ఆధారిత ట్రేడింగ్ ప్లాట్ ఫాం- కైట్ పేరిట తెలుగులోనూ ట్రేడింగ్ చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. తద్వారా దేశంలోనే తొలి ప్రాంతీయ భాషా ట్రేడింగ్ ఫ్లాట్ ఫాం... తెలుగు భాషలోనే ఏర్పాటు చేసిన ఆ సంస్థ, ఈ దిశగా అడుగేసిన తొలి సంస్థగా రికార్డులకెక్కింది. ఈ మేరకు నిన్న ‘జిరోధా’ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ రంగప్ప హైదరాబాదులో కీలక ప్రకటన చేశారు. డెస్క్ టాపులతో పాటు మొబైల్స్, ట్యాబ్స్ లోనూ ఈ సేవలను అందుబాటుకి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఫ్లాట్ ఫాంలో 70 వేలకు పైగా కంపెనీల షేర్ల క్రయ విక్రయాలను నిర్వహించుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే కంపెనీల విస్తరణలో తెలుగు రాష్ట్రాలు కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ కీలక అడుగు వేశామని రంగప్ప చెప్పారు.

More Telugu News