: ఎలిజబెత్ రాణి II... ఆశ్చర్యపరిచే వాస్తవాలు!

ఎలిజబెత్ రాణి -II రేపు తన 90వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురించి ఇంతవరకూ తెలియని ఆశ్చర్యపరిచే వాస్తవాల్లో కొన్ని తెలుసుకుందాం. * 1959-63 మధ్య సంవత్సరాలు మినహా బ్రిటన్ పార్లమెంట్ ప్రారంభ సమావేశాలు అన్నింటికి ఆమె హాజరయ్యారు. * వరల్డ్ వార్ -II జరుగుతున్న సమయంలో మ్యూజిక్, డాన్స్, జోక్ లతో నిర్వహించిన ఎన్నో ప్రదర్శనల్లో ఆమె నటించింది. ప్రతి ఏటా ఈ ప్రదర్శనలు విండ్సర్ క్యాజిల్ లోని వాటర్లూ చాంబర్ లో నిర్వహిస్తుండేవారు. * ఆమె అధికారిక పర్యటనలు చాలా మటుకు రాయల్ షిప్ ‘బ్రిటానియా’లోనే జరిగేవి. ఆమె గౌరవార్థం 1953 ఏప్రిల్ 16వ తేదీన ‘బ్రిటానియా’ను ప్రారంభించారు. దీని సేవలు 1954 జనవరి 7వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి. 1997 డిసెంబర్ తో ‘బ్రిటానియా’ ను వినియోగించడం ఆపివేశారు. రాయల్, అధికారిక పనుల నిమిత్తం ఒక మిలియన్ మైళ్ల కంటే ఎక్కువగానే ఇది ప్రయాణం చేసింది. * క్వీన్ ఎలిజబెత్ II బ్రిటన్ లో సుదీర్ఘ కాలం పాటు రాణిగా కొనసాగుతున్నారు. * ఇప్పటివరకు లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విభిన్నమైన ఆమె మైనపు విగ్రహాలు ఇరవైమూడు ఉన్నాయి. * ఆమె ధరించే కిరీటం 2,868 డైమండ్లతో పాటు అత్యంత విలువైన, ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రంతో పొదగబడి ఉంటుంది.

More Telugu News