: ప్రతి ఏటా ఏదోఒక వివాదం: ఆవేదన వ్యక్తం చేసిన ప్రీతి జింటా

ఐపీఎల్ ను ప్రతి ఏటా ఏదో ఒక వివాదం పట్టి కుదిపేస్తోందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ యజమాని ప్రీతి జింటా ఆవేదన వ్యక్తం చేసింది. 2013 నుంచి ప్రతి ఏడాది ఏదో ఒక సమస్య చుట్టుముడుతోందని ఆమె పేర్కొంది. 2013లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం రేపితే, 2014లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తొలి సగ భాగం యూఏఈలో నిర్వహించాల్సి వచ్చిందని తెలిపింది. 2015లో రెండు ఫ్రాంఛైజీలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందేనని ఆమె పేర్కొంది. ఈ సీజన్ లో కరవు భాధ, నీటి కొరతతో హోం గ్రౌండ్స్ ను వెతుక్కోవాల్సి వస్తోందని ఆమె చెప్పింది. ఇలాంటి సమస్యలు చూసేందుకు పెద్దగా కనిపించకపోయినా, ఫ్రాంఛైజీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయని ఆమె పేర్కొంది. అంతే కాకుండా వ్యాపారావకాశాలను కూడా దారుణంగా దెబ్బతీస్తాయని ప్రీతి అభిప్రాయపడింది.

More Telugu News