: రికార్డు స్థాయికి విదేశీ మారకం, మారని బంగారం నిల్వ!

ఏప్రిల్ 8తో ముగిసిన వారాంతానికి భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 157.4 మిలియన్ డాలర్లు పెరిగి 359.917 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతకుముందు ఏప్రిల్ 1తో ముగిసిన వారాంతానికి ఫారెక్స్ రిజర్వ్ 4.2 బిలియన్ డాలర్లు పెరిగి 359.7 బి. డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఎఫ్సీఏ (ఫారిన్ కరెన్సీ అసెట్స్) 159.3 మిలియన్ డాలర్లు పెరిగి 335.845 బి. డాలర్లకు చేరాయని తెలిపింది. బంగారం నిల్వల విషయంలో మాత్రం మార్పు నమోదు కాలేదు. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న గోల్డ్ రిజర్వ్ విలువ 20.115 బిలియన్ డాలర్లని, అంతర్జాతీయ ద్రవ్య నిధి వద్ద, భారత ప్రత్యేక విత్ డ్రా హక్కుగా ఉన్న మొత్తం 1.501 బిలియన్ డాలర్లకు చేరిందని ఆర్బీఐ ప్రకటించింది.

More Telugu News