: ఒబామా అడిగారు...కాదనగలమా?: 'గేమ్ ఆఫ్ థ్రోన్స్ 6' డైరెక్టర్

సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు కోరితే ఎవరైనా తీర్చకుండా ఉండగలరా? ఉండలేరు కదా...అందుకే అందరికంటే ముందుగా ఒబామా కోసం ఓ షో ఏర్పాటు చేశామని 'గేమ్ ఆఫ్ థ్రోన్స్ 9' నిర్వాహకులు డేవిడ్ బెనియాఫ్, డిబి వీస్ తెలిపారు. అమెరికన్ డ్రామా సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్ కు ఒబామా వీరాభిమాని. ఇందులో సిరీస్ 6 త్వరలో విడుదల కానుంది. అయితే ఈ ఎపిసోడ్స్ కాపీలు ముందుగా తనకు కావాలని ఒబామా డేవిడ్ బెనియాఫ్, డిబి వీస్ ను కోరారు. సాక్షాత్తూ అమెరికా ప్రెసిడెంట్ ఇలా అడిగితే కాదనగలమా? అందుకే ఆయన కోసం ప్రత్యేకంగా ఓ స్క్రీన్ షో ఏర్పాటు చేశారు. సీరీస్ 5 పైరసీకి గురికావడంతో ఈసారి నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పాత్రికేయులు, టెలివిజన్ పరిశ్రమ పెద్దలు, ప్రముఖులు ఇలా ఎవరినీ ఈ స్క్రీన్ షోకు ఆహ్వానించలేదు. దీంతో ఇది పైరసీకి గురికాదని నిర్వహకులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News