ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ పేర్లు మీవేనా?... సూటిగా చెప్పాలని ‘పనామా' ఇండియన్స్ కు ఐటీ శాఖ తాఖీదులు

Thu, Apr 14, 2016, 01:01 PM
స్వదేశంలో గుట్టుగా దాచుకున్న అక్రమార్జనను బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్ లో పెట్టుబడులుగా మార్చేసిన వివిధ దేశాలకు చెందిన నల్ల కుబేరుల జాబితాను మోసుకొచ్చిన ‘పనామా పేపర్స్’ ప్రపంచ దేశాలతో పాటు భారత్ లోనూ కలకలం రేపాయి. ఈ జాబితాలో దాదాపు 500 మంది భారతీయులున్నట్లు ఆ పేపర్లు వెల్లడించాయి. ఈ జాబితాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో పాటు పలువురు ప్రముఖులు ఉండటంతో పెద్ద దుమారమే రేగింది. ఈ క్రమంలో ఆదాయపన్ను(ఐటీ) శాఖ ఈ వ్యవహారంపై కన్నేసింది.

ఇప్పటికే దీనిపై విచారణ చేపట్టిన ఐటీ శాఖ తాజాగా జాబితాలో పేర్లున్న 500 మందికి నోటీసులు జారీ చేసింది. ఇందులో రెండే రెండు ప్రశ్నలను ఆ శాఖాధికారులు నల్ల కుబేరులకు సంధించారట. ‘‘పనామా పేపర్స్ లో ఉన్న పేర్లు మీవేనా?, మోసాక్ ఫోన్సెకాతో మీ వ్యాపార లావాదేవీలను చెప్పండి’’ అంటూ రెండు ప్రశ్నలను సంధించిన ఐటీ శాఖ.. ఈ రెండు ప్రశ్నలకు మాత్రం సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పాలని కూడా కోరింది. తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవని కూడా సదరు నోటీసుల్లో ఐటీ శాఖ డేంజర్ బెల్స్ మోగించిందని సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.158.241.232
Articles (Latest)
Articles (Education)