ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మావయ్య లాంటి నటుడు దొరకరు: 'ఊపిరి' సక్సెస్ మీట్ లో సుశాంత్

Wed, Apr 13, 2016, 08:23 PM
Related Image తన మావయ్య లాంటి వర్సటైల్ యాక్టర్ మరొకరులేరని యువనటుడు సుశాంత్ తెలిపాడు. ఊపిరి సక్సెస్ మీట్ లో సుశాంత్ మాట్లాడుతూ, వైవిధ్యమైన పాత్రలు వేయడంలో తన మావయ్య నాగార్జున ప్రత్యేకతే వేరని అన్నాడు. 'గీతాంజలి', 'శివ', 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'సోగ్గాడే చిన్నినాయనా', 'ఊపిరి'... ఇలా ఏ సినిమా తీసుకున్నా, ఏ పాత్రకాపాత్ర ప్రత్యేకంగా ఉండేలా ఆయన చూసుకున్నారని సుశాంత్ చెప్పాడు. తెలుగు తెరకు ఇలాంటి నటుడు దొరకడం అదృష్టమని పేర్కొన్నాడు. అలాంటి నటుడు తన లాంటి యువ నటులకు ఎల్లప్పుడూ స్పూర్తిగా ఉంటాడని సుశాంత్ చెప్పాడు. తాతగారి పేరును నిలబెడుతూ, తనదైన శైలిలో ఆయన రాణించారని సుశాంత్ తెలిపాడు. 'ఊపిరి' లాంటి సినిమాలో నటించాలంటే ఓ ఇమేజ్ ఉన్న నటుడు ఎవరైనా ఆలోచిస్తారని, ఆయన మాత్రం అలాంటి ఆలోచన పెట్టుకోకుండా దానిని అంగీకరించడం ఆయనలోని ప్రత్యేకతను తెలియజేస్తుందని సుశాంత్ చెప్పాడు.
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Articles (Latest)
Articles (Education)