: ఫోర్డ్ 'ఫ్యూజన్'కు లైట్లతో పని లేదు...చీకట్లో అయినా దూసుకుపోతుంది!

డ్రైవర్ లెస్ కార్లను తయారు చేయడంలో గూగుల్, టెస్లా, వుబర్ తదితర సంస్థలన్నీ తలమునకలై ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ సంస్థలు తయారు చేసిన డ్రైవర్ లెస్ కార్లన్నీ దట్టమైన పొగ, చిమ్మ చీకట్లను చీల్చుకుపోవడంలో విఫలమయ్యాయి. అయితే ఫోర్డ్ కంపెనీ రూపొందించిన హైబ్రీడ్ కారు 'ఫ్యూజన్' మాత్రం ఇలాంటి ఇబ్బందులను సులువుగా అధిగమిస్తుందని ఆ కారు తయారు చేసిన సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. దట్టమైన పొగ అలముకున్నా, చిమ్మచీకట్లలో అయినా ఈ కారులో ఏర్పాటు చేసిన 3డీ మ్యాపింగ్ లైడార్ పరిజ్ఞానం చుట్టుపక్కల ప్రదేశాలను గుర్తిస్తుందని వారు తెలిపారు. రోడ్డు మ్యాపులు, రూట్ మ్యాపుల ద్వారా రోడ్డును, ప్రస్తుతం కారున్న ప్రదేశాన్ని గుర్తించి సాఫీగా ప్రయాణిస్తుందని వారు చెప్పారు. దీనిని ఇప్పటికే రాత్రి వేళల్లో పరిశీలించామని, అద్భుతమైన ఫలితం వచ్చిందని వారు తెలిపారు.

More Telugu News