: ఆయుష్షును మరో పదేళ్లు పెంచే మాత్ర వచ్చేస్తోంది!

మానవ ఆయుర్దాయాన్ని మరో 10 సంవత్సరాలు పెంచేలా ఓ చిన్న మాత్ర రాబోతోంది. వయసు పెరుగుతున్న కొద్దీ, శరీరంలోని అవయవాల పనితీరును తగ్గిస్తూ వచ్చే ప్రొటీన్ మాలిక్యూల్స్ జాడను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇక దీన్ని నివారిస్తే ఆయుర్దాయం పెరుగుతుందని డాక్టర్ జార్జ్ ఇవాన్ క్యాస్టిల్లో-క్వాన్ నేతృత్వంలో నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడించింది. జీఎస్కే-3 పేరున్న ప్రొటీన్ మాలిక్యూల్ అవయవాల పనితీరును తగ్గిస్తోందని, దీన్ని నేరుగా ప్రభావితం చేసే మాత్ర తయారీకి ఎంతో కాలం పట్టకపోవచ్చని ఈ సందర్భంగా జార్జ్ వ్యాఖ్యానించారు. వయసు మీదపడితే వచ్చే అల్జీమర్స్, మధుమేహం, పార్కిన్సన్, క్యాన్సర్ వంటి రోగాలను సైతం ఈ మాత్రతో దూరం చేయవచ్చని తెలిపారు. "జీఎస్కే-3ని కనుగొనడంతో మేమెంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాం. వయసుతో పాటే వచ్చే అన్ని రోగాల నుంచీ విముక్తి లభించనుంది. మధ్య వయసులో ఈ మాత్రలు వాడటం ద్వారా వృద్ధాప్యాన్ని దూరం చేసుకుని మరింత కాలం జీవించవచ్చు" అని ఆయన తెలిపారు.

More Telugu News