: ప్రత్యూష ఆత్మహత్య వెనుక ఇదీ అసలు కథ!: 'చిన్నారి పెళ్లికూతురు' తల్లిదండ్రుల వాంగ్మూలం

బుల్లితెరనే కాకుండా బాలీవుడ్ ను సైతం కుదిపేసిన ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య ఉదంతంలో కీలక విషయాలను పోలీసులు తెలుసుకున్నారు. దీంతో ఆసుపత్రి నుంచి రాహుల్ రాజ్ సింగ్ డిశ్చార్జ్ అయిన వెంటనే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడిన తరువాత రాహుల్ ను పోలీసులు రెండుసార్లు ప్రశ్నించారు. అనంతరం ప్రత్యూష తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ వాంగ్మూలం వివరాల్లోకి వెళితే...ప్రత్యూష బెనర్జీ కెరీర్ పరంగా ఉన్నత స్థాయిలో ఉండగానే రాహుల్ ఆమెను వలలో వేసుకున్నాడు. అయితే, అప్పటికే రాహుల్ కు మరొక మహిళతో ఉన్న సంబంధం కారణంగా తొమ్మిదేళ్ల కుమారుడున్నాడు. ఈ క్రమంలో ప్రత్యూషను ప్రేమించే ముందు, ముంబైలో తనకు నాలుగు ఫ్లాట్ లు ఉన్నాయని, సొంత ఊళ్లో 150 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని అబద్ధాలు చెప్పాడు. అంతే కాకుండా తన తల్లి ఎమ్మెల్యే అని కూడా ఆమెను నమ్మబలికాడు. అలా ప్రత్యూష జీవితంలోకి రాహుల్ రాజ్ సింగ్ ప్రవేశించాడు. ఆ తరువాత స్నేహితులు ఎవరూ కలవకూడదని ఆమెపై ఆంక్షలు విధించాడు. ఆ తరువాత కుటుంబంతో ఉండకూడదని, తనతోనే ఉండాలని షరతు విధించాడు. దీంతో కుమార్తె జీవితం ముఖ్యమని భావించిన కుటుంబ సభ్యులు ఆమెను విడిచి వెళ్లారు. ప్రత్యూష పాత సంబంధాలను గుర్తుచేసి దారుణంగా కొట్టేవాడని, రాహుల్ కొట్టినప్పుడల్లా గట్టిగా అరుపులు వినిపించేవని, వారు నివసించిన కాందివ్లీ నివాసం చుట్టుపక్కల వారు తెలిపారని వారు చెప్పారు. రాహుల్ చేసిన అప్పులు పెరిగిపోయి, వారు నివసించే ఇంటి అద్దె కట్టడం కూడా కష్టంగా మారిందని వారు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు శారీరక హింస కూడా పెరిగిపోవడంతో ప్రత్యూష తన అంకుల్, ఆంటీలతో తన బాధలు పంచుకుందని వారు పోలీసులకు తిెలిపారు. త్వరలో మరికొందరి నుంచి కూడా వాంగ్మూలం తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.

More Telugu News