: లోథా కమిటీ నివేదిక ప్రకారం తీసుకున్న చ‌ర్య‌లేవి?: బీసీసీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం

జ‌స్టిస్‌ లోథా కమిటీ సిఫారసులను అమలుచేసే విషయంలో వెనక్కి తగ్గుతున్న బీసీసీఐను సుప్రీంకోర్టు మ‌రోసారి విమ‌ర్శించింది. కమిటీ నివేదికలో ఏవైనా ఇబ్బందికర సిఫారసులు ఉంటే తామే వాటిని గుర్తించి, కమిటీకి చెబుతామని ఇప్ప‌టికే చెప్పిన న్యాయస్థానం... తాజాగా, లోథా క‌మిటీ ప్రతిపాదనలు అమలు చేయలేమని త‌మ‌కు చెప్పొద్దంటూ బీసీసీఐని మందలించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరిపిన లోథా కమిటీ నివేదిక ప్ర‌కారం బీసీసీఐ విధులు నిర్వర్తించక పోవ‌డం సరికాదని ఘాటుగా స్పందించింది. బీసీసీఐలో జరిగే వ్యవహారాలు పారదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. ఐపీఎల్ మ్యాచ్‌ ఫిక్సింగ్ వంటి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును పూర్తిగా సంస్కరించాలని లోథా క‌మిటీ సూచించిన విషయం తెలిసిందే. పాలనా విభాగాన్ని ప్రక్షాళణ చేయాలని, రాజకీయ జోక్యం తగ్గించాలని అప్ప‌ట్లో పేర్కొంది. ఒకే వ్యక్తి బీసీసీఐలో, రాష్ట్ర సంఘంలోనూ ఒకే సమయంలో సభ్యుడుగా ఉండకూడదనే పలు ప్రతిపాదనలను లోథా కమిటీ ప్రతిపాదించింది.

More Telugu News