: సంవత్సరంలో రూ. 1.60 కోట్లు విదేశాలకు పంపొచ్చు... మరి ఈ 500 మందిలో నేరస్తులెందరో?: రఘురాం రాజన్

ప్రతి భారతీయుడూ చట్టబద్ధంగా ఒక సంవత్సరం కాల వ్యవధిలో 2.50 లక్షల డాలర్లు (సుమారు రూ. 1.60 కోట్లు) విదేశాల్లో పెట్టుబడులు పెట్టవచ్చని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ గుర్తు చేశారు. 'పనామా పేపర్స్' వెల్లడించిన జాబితాల్లో నల్లధనాన్ని విదేశాల్లో దాచినవారి గురించి ప్రస్తావించిన ఆయన, ఈ 500 మందిలో ఎందరు చట్ట విరుద్ధంగా నియమిత మొత్తాలకు మించిన పెట్టుబడులు పెట్టారన్న విషయం విచారణలో తేలుతుందని అన్నారు. నేరం చేశారని తేలితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విదేశాల్లో బ్యాంకు ఖాతా ఉండాలంటే, అందుకు సరైన కారణం చూపాల్సి వుంటుందని తెలిపారు. సిబీడీటీ, ఈడీ తదితర సంస్థలతో కలసి తాము కూడా ఈ ఖాతాలపై విచారణ జరపనున్నామని రాజన్ పేర్కొన్నారు.

More Telugu News