: టీమిండియా డైరక్టర్గా రవిశాస్త్రే కొనసాగాలి: వసీం అక్రమ్

టీమిండియా డైరక్టర్గా రవిశాస్త్రి పదవీకాలం వరల్డ్ టీ20 టోర్నీతో ముగియడంతో కొత్త కోచ్‌గా ఎవ‌రిని నియమించాల‌నే అంశంపై క్రికెట్ విశ్లేష‌కుల నుంచి ప‌లు వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే ఈ విషయమై సమావేశమైన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లతో కూడిన త్రిసభ్య సలహా సంఘం ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రావిడ్ అతికినట్టు సరిపోతాడని భావించిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ విష‌యంపై పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, లెప్ట్ హ్యాండ్ ఫేస్ బౌలర్‌ వసీం అక్రమ్ సైతం త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించాడు. టీమిండియా డైరక్టర్గా రవిశాస్త్రే కొనసాగాలని అన్నాడు.'రవిశాస్త్రి సుముఖంగా ఉంటే ఆయన హాట్ సీట్లో కొనసాగాలి' అంటూ అని అక్రమ్ పేర్కొన్నాడు. అంతేకాదు డైరక్టర్గా రవిశాస్త్రి టీమిండియాలో ఆత్మ‌విశ్వాసాన్ని నింపార‌ని అన్నాడు. రవిశాస్త్రి వచ్చాక భారత్ మళ్లీ అద్భుతంగా రాణిస్తోంద‌ని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా గడ్డపై టి-20 సిరీస్ టీమిండియా ఇటీవలే క్లీన్ స్వీప్ చేసిన విష‌యాన్ని గుర్తు చేశాడు.

More Telugu News