: మీడియాకు కాళ్లు చూపుతూ మాట్లాడిన సామ్యూల్స్ పై విమర్శల వర్షం!

ఇంగ్లండ్ పై ఫైనల్ పోరులో గెలిచిన ఆనందంతో కూడిన గర్వం వెస్టిండీస్ ఆటగాడు సామ్యూల్స్ ను చిక్కుల్లో పడేసింది. మీడియాతో మాట్లాడుతున్న వేళ, కుర్చీలో కూర్చున్న సామ్యూల్స్, మీడియా మైకులు పెట్టే టేబుల్ పై రెండు కాళ్లూ ఎత్తి పెట్టుకుని నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పడాన్ని ఇప్పుడు పలువురు విమర్శిస్తున్నారు. మీడియాతో సమావేశానికి విధిగా జట్టు మేనేజర్ తో రావాల్సిన సామ్యూల్స్, ఆయన లేకుండానే హాజరు కావడం, అంతకుముందు ఇయాన్ మోర్గాన్ తుది ప్రెస్ మీట్ జరుగుతుండగానే వచ్చి డయాస్ ఎక్కడం సామ్యూల్స్ చేసిన ఓ తప్పు కాగా, ఆపై నిర్లక్ష్యపు ధోరణితో, తొలి ప్రశ్నను ఎదుర్కోకముందే కాళ్లను పైకి పెట్టడం ఏ మాత్రం సబబని సామాజిక మాధ్యమాల్లో చర్చలు సాగుతున్నాయి.

More Telugu News