: మీడియా అతి చేసిందన్న మాల్యా!... బాధ్యతగానే వ్యవహరించిందన్న సుప్రీం!

రుణాలు తీసుకున్న మాల్యా బాగానే ఉన్నారు. రుణాలచ్చిన బ్యాంకులు కూడా బాగానే ఉన్నాయి. బ్యాంకుల్లోని ప్రజల సొమ్మును పారిశ్రామికవేత్తలు లూటీ చేస్తున్నారని వార్తలు రాసిన మీడియా మాత్రం నేరం చేసిందట. ఇదీ సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగాః మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తరఫు లాయర్ చేసిన వింత వాదన. బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి లండన్ చెక్కేసిన మాల్యా... ఆ తర్వాత తనకు రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్టియంతో రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారట. ఇక తమ వద్ద అప్పులు తీసుకున్న విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయారని గగ్గోలు పెడుతూ కోర్టులను శరణువేడిన బ్యాంకులు కూడా విజయ్ మాల్యా పిలవగానే వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యాయి. ఆ విషయాన్ని మాల్యా లాయర్ కోర్టుకు చెబితే కాని వెల్లడి కాలేదు. విచారణలో భాగంగా మీడియా అతి చేసిందని మాల్యా లాయర్ ఆరోపించారు. అయితే, ఈ వాదనను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కురియన్ కొట్టిపారేశారు. సమాజ హితాన్ని బాధ్యతగా పరిగణిస్తున్న మీడియా మాల్యాపై కథనాలు రాయడంలో ఎలాంటి పొరపాటు లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

More Telugu News