: ఈ సారైనా ఎస్బీఐ యత్నం ఫలించేనా?... వేలానికి కింగ్ ఫిషర్ లోగో, ట్రేడ్ మార్క్

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఇచ్చిన రుణాలను రాబట్టుకునేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఎస్బీఐ) పట్టు వదలని విక్రమార్కుడిలా యత్నిస్తూనే ఉంది. ఇప్పటికే మాల్యా విమానయాన సంస్థ కింగ్ ఫిషర్ కు చెందిన పలు ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఆ బ్యాంకు... వాటిని వేలం వేసేందుకు నానా తిప్పలు పడుతోంది. మొన్నటికి మొన్న ముంబైలోని కింగ్ ఫిషర్ ప్రధాన కార్యాలయాన్ని వేలం వేసేందుకు ఎస్బీఐ చేసిన యత్నం ఫలించలేదు. ఈ భవనాన్ని కొనేందుకు సింగిల్ బిడ్ కూడా దాఖలు కాలేదు. తాజాగా కింగ్ ఫిషర్ లోగో, ట్రేడ్ మార్క్ ను వేలం వేసేందుకు ఎస్బీఐ రంగం సిద్ధం చేసింది. ఈ రెండింటి కనీస ధరగా రూ.367 కోట్లను నిర్ణయించిన ఎస్బీఐ... నేడు వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మరి వీటికైనా బిడ్డర్లు వస్తారో? లేదో? చూడాలి.

More Telugu News