: మైక్రోసాఫ్ట్ గురించి మీకు తెలియని అమేజింగ్ ఫ్యాక్ట్స్!

నచ్చినా, నచ్చకున్నా ప్రపంచ టెక్ రంగ అగ్రగామిగా ప్రతి దేశానికీ విస్తరించిన సంస్థ మైక్రోసాఫ్టేనని అంగీకరించక తప్పదు. 1970లో ప్రారంభమైన ఈ సంస్థ 90వ దశకంలో కంప్యూటర్ రంగాన్నే మలుపు తిప్పింది. ప్రస్తుతం సీఈఓ సత్య నాదెళ్ల నేతృత్వంలో ముందుకు సాగుతున్న మైక్రోసాఫ్ట్ గురించి ఎంతో మందికి తెలియని అమేజింగ్ ఫ్యాక్ట్స్... యాపిల్ దివాలా తీయకుండా అడ్డుకుంది: 1997లో యాపిల్ సంస్థ పెను నష్టాల్లో కూరుకుపోయి దివాలా దిశగా సాగుతున్న వేళ, మైక్రోసాఫ్ట్ ఆదుకుంది. అప్పట్లో 150 మిలియన్ డాలర్లు (ప్రస్తుత కరెన్సీలో సుమారు రూ. 1000 కోట్లు) పెట్టుబడిగా పెట్టింది. చిన్న వయసులోనే బిలియనీర్ గా బిల్ గేట్స్: 29 ఏళ్ల క్రితం నాటి విషయమిది. అప్పట్లో 31 సంవత్సరాల వయసులో ప్రపంచంలోనే అతి తక్కువ వయసున్న బిలియనీర్ గా బిల్ గేట్స్ గుర్తింపు పొందాడు. ఆపై ఎనిమిదేళ్ల వయసులోనే 12.9 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 86 వేల కోట్లు) ఆస్తితో అతిపెద్ద ధనవంతుడిగా నిలిచాడు. 12 వేల మంది మిలియనీర్లను సృష్టించింది: మైక్రోసాఫ్ట్ ను నమ్ముకుని 12 వేల మందికి పైగా మిలియనీర్లుగా మారారు. ఇద్దరు బిలియనీర్లయ్యారు. కంపెనీ తొలి లోగోను డిజైన్ చేసింది బిల్, పౌల్: సంస్థ తొలినాళ్లలో లోగోను తయారు చేయించేందుకు డబ్బు చెల్లించలేక బిల్ గేట్స్, పాల్ అలెన్ లు స్వయంగా దీన్ని డిజైన్ చేయించారు. మధ్యలోని 'ఓ' అక్షరాన్ని వారు 'బిబ్లెట్' (నిక్ నేమ్) అని పిలుచుకునేవారు. విండోస్ 95 థీమ్ సాంగ్ 'రోలింగ్ స్టోన్స్': సిస్టమ్ ఆన్ చేయగానే వచ్చే మ్యూజిక్ ను కంపోజ్ చేసింది ప్రముఖ మ్యుజీషియన్ బ్రియాన్ ఎనో. రోలింగ్ స్టోన్స్ ఆల్బమ్ కోసం ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్ నుంచి దీన్ని తీసుకున్నారు. మొట్టమొదటి కిల్లర్ ప్రోగ్రామ్ ఎక్సెల్: మైక్రోసాఫ్ట్ డిజైన్ చేసిన ఎక్సెల్ ప్రోగ్రామ్ ఆ సంస్థకు ఎనలేని ఖ్యాతిని తెచ్చి పెట్టింది. అప్పటివరకూ ఉన్న యాపిల్ విసీ క్లాక్, లోటస్ 1-2-3 తదితరాలు ఎక్సెల్ రాకతో మాయమైపోయాయి. మొత్తం 48 వేలకు పైగా పేటెంట్లు: మైక్రోసాఫ్ట్ వద్ద 48 వేలకు పైగా పేటెంట్లు ఉన్నాయి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే, 48,313 రకాల పరిశోధనలు, ప్రొడక్టులపై పూర్తి అధికారం మైక్రోసాఫ్ట్ దే. భవిష్యత్తులో టెక్ ప్రపంచంలో సంచలనం రేపుతుందన్న 'హోలో లెన్స్' హెడ్ సెట్ పై హక్కులూ ఈ సంస్థవే. తొలి స్మార్ట్ వాచ్ 22 ఏళ్ల క్రితమే వచ్చింది: 1994లోనే మైక్రోసాఫ్ట్ తొలి స్మార్ట్ వాచ్ ని విడుదల చేసింది. టైమెక్స్ తో కలసి మైక్రోసాఫ్ట్ డిజైన్ చేసిన దీని పేరు డేటా లింక్ 150. ఇది ప్రపంచపు తొలి స్మార్ట్ వాచ్, ఆపై 12 ఏళ్లకు యాపిల్ స్మార్ట్ వాచ్ వచ్చింది. బిల్ గేట్స్ ఇంటి విలువ రూ. 824 కోట్లు: 1988లో వాషింగ్టన్ సమీపంలో సుమారు 66 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మెడీనా ఎస్టేట్ (గేట్స్ పెట్టుకున్న ముద్దు పేరు క్సనాడు 2.0) 2 మిలియన్ డాలర్లకు ఆయన కొన్నారు. ఇప్పుడు దాని విలువ 123 మిలియన్ డాలర్లు. సంవత్సరానికి 2.3 కోట్ల ఉచిత డ్రింక్స్ లాగించేస్తారు: మైక్రోసాఫ్ట్ లో పని చేస్తున్న ఉద్యోగులు ప్రతి ఏటా 2.3 కోట్ల పానీయాలను ఉచితంగా తాగుతుంటారు. వీటిల్లో ఆత్యధికం పాలు, ఆరంజ్ జ్యూస్ ఉంటాయట. స్నేహితులే శత్రువులయ్యారు: తొలి మ్యకింతోష్ కంప్యూటర్ కోసం సంవత్సరాల తరబడి బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ కలిసి పని చేశారు. మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ ను ఎనౌన్స్ చేసిన తరువాత వీరిద్దరి మధ్యా దూరం పెరిగింది. ఇరు కంపెనీల మధ్యా వ్యాపార శత్రుత్వం దశాబ్దాలుగా సాగుతోంది.

More Telugu News