: ప్రపంచాన్ని వణికిస్తూ, బంగ్లాదేశ్ వరకూ వచ్చేసిన భయంకర జికా!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న జికా వైరస్ మన పొరుగు దేశం బంగ్లాదేశ్ కు వచ్చేసింది. దక్షిణాసియా దేశాల్లో తొలి కేసుగా బంగ్లాకు చెందిన ఓ వ్యక్తికి జికా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. డెంగ్యూ తదితర వైరల్ జ్వరాలతో బాధపడుతున్న మొత్తం 101 మందిలో జికా ఇన్ఫెక్షన్ ఉందేమోనని పరీక్షలు జరపడంతో, చిట్టగాంగ్ కు చెందిన 67 ఏళ్ల వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఎన్నడూ విదేశాలకు వెళ్లని ఆ వ్యక్తి రక్తంలో జికా వైరస్ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించిందని బంగ్లాదేశ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ డైరెక్టర్ మహ్మదుర్ రెహ్మాన్ వివరించారు. ప్రస్తుతం ఆరోగ్య నిపుణుల పరిశీలనలో ఉన్న ఇతని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. మరో 159 మంది తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వారిని పరీక్షించాల్సి వుందని అన్నారు. కాగా, దోమకాటుతో వచ్చే ఈ జికా వైరస్ కారణంగా గర్భస్థ శిశువులు మెదడు సంబంధిత రుగ్మతలతో జన్మిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News