: ఇన్ఫీబీమ్ హ్యాపీ... తొలి ఈ-కామర్స్ ఐపీఓ విజయవంతం

ఇండియాలో నిధుల సమీకరణ నిమిత్తం మార్కెట్లను ఆశ్రయించిన తొలి ఈ-కామర్స్ సంస్థ ఇన్ఫీబీమ్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) విజయవంతమైంది. మ్యూచువల్ ఫండ్స్ ఈ ఐపీఓకు దూరంగా ఉన్నప్పటికీ రిటైల్ ఇన్వెస్టర్లు పెద్దఎత్తున స్పందించారని బీఎస్ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 1.25 కోట్ల ఈక్విటీలను విక్రయానికి ఉంచగా, 1.385 కోట్లకు దరఖాస్తులు వచ్చాయి. సంస్థాగత ఇన్వెస్టర్లు 86 శాతం బిడ్లను దాఖలు చేశారు. కాగా, ఇన్ఫీబీమ్ ఒక్కో షేరును రూ. 360 నుంచి రూ. 432 మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. లోయర్ ఎండ్ ధరపై ఈక్విటీలను విక్రయించినా సంస్థకు రూ. 450 కోట్లు వస్తాయి. ఈ ఐపీఓ విజయవంతంతో మరిన్ని ఈ-కామర్స్ కంపెనీలు నిధుల సమీకరణకు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. "ఇన్ఫీబీమ్ ఐపీఓకు చాలా వరకూ బిడ్లు అప్పర్ ఎండ్ ప్రైస్ బ్యాండ్ పైనే వచ్చాయి. దీని ఫలితంగా అన్ని క్యాటగిరీల్లో ఐపీఓ విజయవంతమైంది" అని ఓ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ వ్యాఖ్యానించారు.

More Telugu News