: అమ్మకాల వెల్లువతో భారీగా నష్టపోయిన మార్కెట్

ఇటీవలి లాభాల అనంతరం ఇన్వెస్టర్లు తమ ఈక్విటీలను విక్రయించేందుకే మొగ్గు చూపడంతో భారత స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపు కన్నా తక్కువగా ఆరంభమైన సూచికలు, ఆపై మరే దశలోనూ పుంజుకోలేకపోయాయి. గత కొన్ని సెషన్లుగా 7,500 పాయింట్ల వద్ద మద్దతు కూడగట్టుకోవడంలో ఇబ్బందులు పడుతున్న నిఫ్టీ, ఈక్విటీల విక్రయాలతో ఆ స్థాయి నుంచి జారిపోయింది. మంగళవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 253.11 పాయింట్లు పడిపోయి 1.02 శాతం నష్టంతో 24,551.17 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 78.15 పాయింట్లు పడిపోయి 0.38 శాతం లాభంతో 7,538.75 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.79 శాతం, స్మాల్ క్యాప్ 0.91 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 36 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, కెయిర్న్ ఇండియా, టెక్ మహీంద్రా, వీఈడీఎల్ తదితర కంపెనీలు లాభపడగా, కోటక్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐడియా, సన్ ఫార్మా, టీసీఎస్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,801 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,011 కంపెనీలు లాభాల్లోను, 1,633 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. సోమవారం నాడు రూ. 92,04,276 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 91,28,465 కోట్లకు తగ్గింది.

More Telugu News