: స్లిమ్ గా మారాలనుకుంటున్నారా?...ఈ చిట్కా పాటించండి

జంక్ ఫుడ్ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ఊబకాయం సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో యుక్తవయసు వచ్చేసరికే స్లిమ్ అవ్వాలని కోరుకునే వారు ఎక్కువయ్యారు. వీరి బలహీనతను సొమ్ము చేసుకుంటూ ఎన్నో ఆరోగ్య కేంద్రాలు పురుడుపోసుకుంటున్నాయి. అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన పరిశోధకుల టీమ్ వ్యాయామం, డైటింగ్ వంటివి లేకుండా స్లిమ్ అయ్యే విధానంపై పరిశోధనలు నిర్వహించారు. సుమారు 18,300 మందిపై పరిశోధనలు చేసిన ఈ టీమ్ కేవలం మంచి నీరు తాగడం ద్వారా స్లిమ్ గా మారవచ్చని అన్నారు. నీరు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల షుగర్, ఉప్పు పదార్థాలను తీసుకోవాల్సిన అవసరం తగ్గుతుందని వారు పేర్కొన్నారు. అలాగే ప్రతి రోజూ ఒక కప్పు నుంచి మూడు కప్పుల నీరు అదనంగా తీసుకోవడం వల్ల 68 నుంచి 205 కేలరీల భోజనం, 78 నుంచి 235 గ్రాముల ఉప్పు తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయిందని, తద్వారా మునుపటి కంటే స్లిమ్ గా తయారయ్యారని వారు వెల్లడించారు.

More Telugu News