: పన్ను చెల్లింపుదారులకు దక్కిన ప్రయోజనాలివే!

ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కొద్ది మొత్తంలో పన్ను చెల్లింపుదారులపై కాస్తంత కరుణ చూపారు. ఈ మేరకు పలు రాయితీలు ప్రకటించారు. ఆదాయపు పన్ను సెక్షన్ 87 ఏ కింద వార్షిక పన్ను రూ. 5 వేల లోపు చెల్లిస్తున్న వారికి రూ. 3 వేల రాయితీని ప్రకటించారు. దీంతో సాలీనా రూ. 5 లక్షల వరకూ ఆదాయం పొందుతున్న వారు గరిష్ఠంగా రూ. 2 వేల పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఈ నిర్ణయం సుమారు 2 కోట్ల మంది వేతన జీవులకు ప్రయోజనం కలిగించనుంది. దీంతో పాటు ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్సులపై పన్ను రాయితీని రూ. 24 వేల నుంచి రూ. 60 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇది సొంతిల్లు లేని, హెచ్ఆర్ఏ పొందని వేలాది మందిని పన్ను భారం నుంచి దూరం చేయనుంది. ఇదే సమయంలో రూ. 35 లక్షల వరకూ గృహ రుణాలు తీసుకునే వారికి అదనంగా రూ. 50 వేల వడ్డీ రాయితీ (ఏడాదికి) దగ్గర చేస్తున్నట్టు తెలిపారు. అయితే, వీరి ఇంటి విలువ రూ. 50 లక్షలను మించరాదు. ఇవి మినహా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు పెద్దగా ప్రయోజనాలేవీ జైట్లీ కల్పించలేదు. కనీస పన్ను పరిధిని రూ. 2.5 లక్షల నుంచి 3 లక్షలకు సవరిస్తారని అందరూ భావించినా, ఆ దిశగా నిర్ణయం వెలువడలేదు.

More Telugu News