: బడ్జెట్ భయం... నష్టాల్లోకి జారిపోయిన మార్కెట్!

బడ్జెట్ ఎలా ఉంటుందోనన్న భయం స్టాక్ మార్కెట్ నూ వదల్లేదు. ప్రతిపాదనలు ఎలా ఉంటాయి? పారిశ్రామిక వర్గాల ప్రయోజనాలకు చోటుందా? విదేశీ పెట్టుబడులపై తదుపరి వైఖరేంటి? తదితర ప్రశ్నలు మనసులో ఉదయిస్తున్న వేళ, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ అమ్మకాల దిశగా సాగడంతో సెషన్ ఆరంభంలో లాభాల్లో ఉన్న సూచికలు, ఆపై కాసేపటికే నష్టాల్లోకి జారిపోయాయి. సోమవారం నాటి సెషన్ లో ఉదయం 10:30 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 54.32 పాయింట్లు పడిపోయి 23,094 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 20 పాయింట్లు పడిపోయి 7,009.20 పాయింట్ల వద్దకు చేరాయి. బ్యాంకుల ఈక్విటీలు లాభాల్లో నడుస్తుండగా, ఇన్ ఫ్రా, పెట్రోలియం, ఆటో, ఫార్మా తదితర రంగాల్లోని కంపెనీలు నష్టాల్లో సాగుతున్నాయి.

More Telugu News