: ఫ్లిప్ కార్ట్ కు అంత సీను లేదు: మోర్గాన్ స్టాన్లీ

దేశంలోని అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ విలువను తగ్గిస్తున్నట్టు రీసెర్చ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ప్రకటించింది. గత సంవత్సరం 15 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.03 లక్షల కోట్లు)గా ఉన్న ఫ్లిప్ కార్ట్ విలువ ప్రస్తుతం 4 బిలియన్ డాలర్లు తగ్గి 11 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 75,625 కోట్లు) చేరినట్టు మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది. జూన్ 2015తో పోలిస్తే సంస్థలో పెట్టుబడులు 27 శాతం తగ్గి 58.9 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 405 కోట్లు) చేరిందని, దీంతో బ్రాండ్ వాల్యూ సైతం దిగజారిందని నిపుణులు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో సంస్థ నిధుల సమీకరణ సవాలుగా మారనుందని అమేజాన్ వంటి దిగ్గజాలతో పాటు ఎన్నో చిన్న చిన్న సంస్థల నుంచి పోటీ పెరగనుందని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది.

More Telugu News