ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భారత ఆర్థిక సర్వే-2016... ముఖ్యాంశాలు!

Fri, Feb 26, 2016, 01:31 PM
Related Image ఈ ఉదయం పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే-2016లోని ముఖ్యాంశాలు.
ద్రవ్యలోటు:
* మొత్తం స్థూల జాతీయోత్పత్తిలో 2015/16 ద్రవ్యలోటు 3.9 శాతం.
* ఈ లక్ష్యాన్ని అందుకోవడం సాధ్యమే.
* 2016/17 ఎన్నో సవాళ్లను మన ముందు ఉంచనుంది.
* స్వల్పకాల ద్రవ్య విధానంపై సమీక్షించాల్సిన సరైన సమయం ఇదే.
ద్రవ్యోల్బణం:
* వినియోగ సూచి ఆధారిత ద్రవ్యోల్బణం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4.5 నుంచి 5 శాతం మధ్య కొనసాగే అవకాశం.
* తగ్గుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలకు మేలు.
* ధరల స్థిరత్వానికి సూచిక కూడా..
* మార్చి 2017లోగా 5 శాతం ఇన్ ఫ్లేషన్ లక్ష్యాన్ని ఆర్బీఐ చేరుకుంటుంది.
కరెంట్ ఖాతాల లోటు:
* జీడీపీలో కరెంట్ ఖాతాల లోటు 1 నుంచి 1.5 శాతం వరకూ ఉండే అవకాశం.
పన్నులు:
* దేశాభివృద్ధి కోసం పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచాలి.
* సంపాదిస్తున్న వారిలో కేవలం 5.5 శాతం మంది మాత్రమే పన్ను చెల్లింపు జాబితాలో ఉన్నారు.
* వీరిని 20 శాతానికి చేర్చాలి.
బ్యాంకింగ్, కార్పొరేట్ రంగం:
* 2018/19 నాటికి బ్యాంకులకు రూ. 1.8 లక్షల కోట్ల మూలధనం అవసరం.
* బ్యాంకులు ఒత్తిడిలో ఉన్నాయి.
* నిరర్థక ఆస్తుల మొత్తాన్ని తగ్గించుకోకుంటే ప్రమాదమే.
* బ్యాంకింగ్ రంగంలో మరిన్ని ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశాలు.
* కొనసాగనున్న డిజిన్వెస్ట్ మెంట్.
* ప్రభుత్వ సంస్థల్లో ప్రజల భాగస్వామ్యం పెరగాలి.
మరిన్ని ముఖ్యాంశాలు:
* గత పదేళ్లలో హార్టికల్చర్ విభాగం 2.7 శాతం చొప్పున విస్తరించింది.
* ఆహార ధాన్యాల కన్నా మెరుగైన దిగుబడి.
* డిమాండున్న పంటల దిశగా రైతులు సాగాలి.
* రైతులకు నియమిత మొత్తంలో సబ్సిడీ అవసరం.
* రైతుల సబ్సిడీ మొత్తాలు నేరుగా బ్యాంకుల్లోకే జమ.
* మొత్తం సబ్సిడీల బిల్లు జీడీపీలో 2 శాతం కన్నా కిందకు తేవాలి.
* జాతీయ ఆహార భద్రత, స్వచ్ఛ భారత్ వేగవంతమవ్వాలి.
* పోషకాహారం, పరిశుభ్రత దిశగా ఎన్నో మెట్లెక్కాలి.
* మేకిన్ ఇండియాకు మరిన్ని ప్రోత్సాహకాలు కావాలి.
* ముడి చమురు ధరలు ఈ ఏడాదంతా బ్యారల్ కు 35 డాలర్ల వద్ద కొనసాగే అవకాశం.
* దీని వల్ల భారత ఖజానాకు మేలు.
* ఇండియాలో కరెంటు బిల్లులు తగ్గే రోజులు భవిష్యత్తులో.
* దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి పెరుగుతోంది.
* ఇండియాలో పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమలకు ఆదరణ.
* ఈ రెండు విభాగాల్లో గణనీయమైన వృద్ధి.
* పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఇండియా.
* మొత్తం పాలల్లో 18.5 శాతం ఇండియాలోనే.
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Articles (Latest)
Articles (Education)