: అసలు ఎయిర్ ఇండియా ఎవరిదో తెలుసా? ప్రైవేట్ ఎయిర్ లైన్స్ పై టాటా 'పంచ్'!

విదేశాలకు విమానాలు నడపాలంటే, ఐదేళ్ల అనుభవం, 20 విమానాలు ఉండాలన్న నిబంధనపై ప్రైవేటు ఎయిర్ లైన్స్ సంస్థలు టాటాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రతన్ టాటా జాతి ప్రయోజనాలు పక్కనపెట్టి, స్వప్రయోజనాల దిశగా అడుగులు వేస్తున్నారని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ లైన్స్ ఆరోపించిన నేపథ్యంలో, టాటా గ్రూప్ ఎదురుదాడికి దిగింది. అసలు ఎయిర్ ఇండియా ఎవరిదో తెలుసా? అని ప్రశ్నించింది. 1932లోనే టాటా ఎయిర్ లైన్స్ ఇండియాలో సేవలందించిందని, దాన్ని ప్రారంభించిందే టాటాలని గుర్తు చేసిన టాటా గ్రూప్, ఆపై అదే ఎయిర్ ఇండియాగా రూపాంతరం చెందిన విషయాన్ని ప్రస్తావించింది. ఇండియాకు విమానాలను తెచ్చిన టాటా గ్రూప్ ను ఇప్పటి ప్రైవేటు సంస్థలు విమర్శించడం విడ్డూరమని విమర్శించింది. కాగా, ప్రస్తుతం టాటా గ్రూప్ ఎయిర్ ఆసియా, టాటా విస్తారాల పేరిట రెండు జాయింట్ వెంచర్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సంస్థలూ విదేశాలకు తక్షణం సర్వీసులు నడపాలని భావిస్తున్నాయి.

More Telugu News