: ఈ ఆహారంతో మీ గుండె ఇక పదిలం!

భారతీయుల సంపాదనలో చివరికి ఏమీ మిగలకపోవడానికి కారణం.. వారికి వస్తున్న గుండె సంబంధిత వ్యాధులే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) పేర్కొంది. తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆహారం గురించి సూచనలు చేసింది. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు దరి చేరే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుందని డబ్ల్యుహెచ్ఓ వెల్లడించింది. ఈ సందర్భంగా సాధారణమైన, ప్రభావవంతమైన ఐదు రకాల ఆహారాన్ని అమెరికన్ హర్ట్ అసోసియేషన్(ఏహెచ్ఏ) సూచించింది. * యాపిల్స్.... ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. * వాల్ నట్స్... ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. * బీన్స్... మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. సాట్యురేటెడ్ ఫ్యాట్ అసలు ఉండదు. * ఆలివ్ ఆయిల్...మంచి కొలెస్ట్రాల్ ను పెంచి, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. * ఓట్స్... ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్ ను రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు తీసుకోవచ్చని ఏహెచ్ ఏ సూచిస్తోంది.

More Telugu News