: ఇక 'కీ'తో పనిలేదు... యాప్ టెక్నాలజీతో పనిచేసే ఓల్వో కార్లు!

కారు స్టార్ట్ చేయాలంటే 'కీ' ఉండాలి. కానీ భవిష్యత్తులో ఇక కారుకు 'కీ' అవసరం ఉండదు. మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ తోనే కారు ఇంజిన్ ను స్టార్ట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన యాప్ ను రూపొందిస్తున్నారు. కారు తాళం చెవి చేసే పనిని ఆ మొబైల్ యాప్ చేసేస్తుంది. బ్లూటూత్ ఆధారిత డిజిటల్ కీ టెక్నాలజీతో పనిచేసేలా స్వీడన్ వాహన తయారీ సంస్థ ఓల్వో ఓ మొబైల్ యాప్ ను రూపొందించబోతోంది. 2017లో ఆ యాప్ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఓల్వో కార్లను కూడా అందుకు తగ్గట్టుగా రూపొందించనుంది. ఈ యాప్ ద్వారా డ్రైవర్లకు మల్టిపుల్ డిజిటల్ కీస్ ను ఇస్తారు. వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న విభిన్న వాహనాలను ఈ యాప్ ద్వారా నియంత్రించవచ్చు. కారును అద్దెకు తీసుకునే వారు కూడా ఈ టెక్నాలజీని వాడుకోవచ్చని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

More Telugu News