: అందరికీ 'అచ్చే దిన్': జైట్లీ సంకేతాలు

మరో 10 రోజుల్లో పార్లమెంట్ ముందుకు రానున్న బడ్జెట్ లో ప్రతి వర్గానికీ నచ్చేలా కొన్ని నిర్ణయాలు ఉంటాయని, దీంతో ప్రజలందరికీ మంచి రోజులు వస్తాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంకేతాలిచ్చారు. పన్ను చెల్లింపుదారుల పరిధుల పెంపుతో పాటు హౌసింగ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ సెక్టార్లలో పెట్టుబడులను ఆకర్షించేలా మరిన్ని పన్ను రాయితీలు ఉండవచ్చని జైట్లీ మాటలను బట్టి తెలుస్తోంది. కార్పొరేట్ ట్యాక్స్ ను 25 శాతానికి తగ్గిస్తానని గతంలో హామీ ఇచ్చిన జైట్లీ దాన్ని నిలబెట్టుకుంటారని ఓ అంచనా. టీడీఎల్ రేషనలైజ్, పరపతి విధాన సరళీకృతం, తదితరాంశాల్లో జైట్లీ నియమించిన జస్టిస్ ఈశ్వర్ కమిటీ సిఫార్సుల్లో కొన్నింటికి పచ్చజెండా ఊపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ప్రయోజనం దగ్గరయ్యేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండే అవకాశాలు ఉన్నాయని జస్టిస్ ఈశ్వర్ కమిటీలో సభ్యుడు, పన్ను విధాన నిపుణుడు ముఖేష్ పటేల్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే వర్గాలకు స్నేహపూర్వకంగా బడ్జెట్ ఉంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News