ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

యాహూ మెయిల్ కూడా జీమెయిల్ లోనే... గూగుల్ కొత్త ఫీచర్!

Sat, Feb 20, 2016, 08:45 AM
Related Image మీరు ఏ వెబ్ సైట్ లో మెయిల్ ఖాతాను కలిగివున్నా, దాన్ని జీమెయిల్ లో తెరచి చూసుకునే సౌకర్యం దగ్గరైంది. ఈ మేరకు గూగుల్ సంస్థ 'జీమెయిలిఫై' పేరిట సరికొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. దీన్నుంచి యాహూ మెయిల్, ఔట్ లుక్, హాట్ మెయిల్ తదితర ఏ మెయిల్ ఖాతానైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆయా మెయిల్ ఖాతాలను ఒక్కసారి జీమెయిలిఫైకి అనుసంధానం చేసుకుంటే సరిపోతుంది. స్పామ్ నుంచి రక్షణతో పాటు ఇన్ బాక్స్ నిర్వహణ వంటి సదుపాయాలూ ఈ సరికొత్త ఆండ్రాయిడ్ యాప్ లో ఉన్నాయని గూగుల్ తన బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. ఒకసారి అనుసంధానం తరువాత తిరిగి ఎప్పుడైనా వాటిని అన్ లింక్ చేసుకోవచ్చని, ఈ సౌకర్యం లేకుండా కూడా జీమెయిల్ యాప్ వాడుకోవచ్చని తెలిపింది. త్వరలో '...ఎట్ జీమెయిలిఫై డాట్ కాం' పేరిట మెయిల్ సేవలనూ ప్రారంభించనున్నట్టు వివరించింది.
X

Feedback Form

Your IP address: 54.158.173.184
Articles (Latest)
Articles (Education)